డబ్బాపాలపై మోజు పెరిగింది..!

ప్రపంచ తెలుగు మహాసభల్లో నాలుగో రోజు సినీ తారలు మెరిశారు. దివంగత నటులు కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి, శ్రీహరి కుటుంబ సభ్యులతోసహా పలువురు సినీ ప్రముఖులను గవర్నర్‌ నరసింహన్‌ సన్మానించారు. దిల్‌రాజు, వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌ దగ్గరుండి అతిథులకు ఆహ్వానం పలికారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు ఒకే వేదికపై కనువిందు చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒక జాతి మాట్లాడే భాషను బట్టి ఆ జాతి సంస్కృతి, నాగరికత ఆధారపడి ఉంటుంది. 

మన భాష తెలుగు భాష. తల్లి ఒడిలో మనం నేర్చుకున్న భాష తెలుగు భాష. తెలంగాణలో పుట్టిన వారికి అభిమానించడం తెలుసని, ఎదురించడం తెలుసని అన్నారు. మా నాన్నగారిని అన్నా అని పిలిచే పిలుపు ఎప్పటికీ మారదని నా నమ్మకం. అదేంటో మనవాళ్ళకి ఈ మధ్య డబ్బా పాల మీద మోజు పెరిగిపోయింది. అమ్మని అమ్మా అని పిలిపించుకోకుండా మమ్మీ అని పిలిపించుకుంటున్నారు. తండ్రినేమో డాడీ అని పిలిపిస్తున్నారు. ఇంకో పాతిక సంవత్సరాల తర్వాత ఈ మమ్మీ డాడీ లే అచ్చమైన తెలుగు శబ్దాలు అని నమ్మే ప్రమాదం ఉంది. తెలుగు రమణీయమైనదని అన్నారు.