
మలయాళ ప్రేమంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నానితో నటించిన ఎం.సి.ఏ మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఇప్పుడు అమ్మడు ఎకౌంట్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. విలక్షణ నటుడు సూర్య హీరోగా సెల్వ రాఘవన్ డైరక్షన్ లో తెరకెక్కే సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసిందట.
ప్రస్తుతం సూర్య విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో గ్యాంగ్ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సెల్వ సినిమా మాత్రం భారీ బడ్జెట్ తో రాబోతుందట. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుందని అంటున్నారు. రకుల్, సాయి పల్లవి ఇద్దరు హరీష్ శంకర్ దాగుడు మూతలు సినిమాలో కూడా నటిస్తున్నారని టాక్.
ఆ సినిమాలో శర్వానంద్, నితిన్ లు నటిస్తున్నారని తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారట. మొత్తానికి ఒకేసారి రెండు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ లక్కీ ఛాన్స్ అందుకున్నారు.