అంజలి ఇలా షాక్ ఇచ్చిందేంటి..!

రాజోలు పిల్లగా పాపులర్ అయిన అంజలి తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ తెచ్చుకుంది. ముందు తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన అంజలి ఆ తర్వాత తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ లాంటి సూపర్ స్టార్లు ఉన్నా సరే తన నటనతో ఆకట్టుకుంది అంజలి. ఇక కొన్నాళ్లుగా తమిళ నటుడు జైతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు రాగా వాటిపై అమ్మడు సైలెంట్ గా ఉంది.

అంతేకాదు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఒకరికొకరు దోశలు వేసుకుని మరి తినిపించుకున్నారు. మరి ఇదంతా సహజీవంలో భాగమే అనుకున్నారు. ఇక ఇవాళో రేపో పెళ్లి వార్త చెబుతారనుకుంటే జై నాకు స్నేహితుడు మాత్రమే అంటూ షాక్ ఇచ్చింది అంజలి. మరి ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్లాక ఇలా కటీఫ్ అవడం ఏంటని ఆరా తీస్తున్నారు. కోలీవుడ్ లో వీరిపై నానా హంగామా చేస్తుండగా వాటిల్లో ఏది వాస్తవం అన్నది తెలియట్లేదు.

ప్రస్తుతం జైతో అంజలి బెలూన్ సినిమాలో నటించింది. హర్రత్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో తెలుగులో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. మరి అంజలి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.