
టి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో సమర్ధవంతమైన నాయకుడిగా తండ్రికి తగ్గ తనయుడిగా తెలంగాణా మంత్రి కె.టి.ఆర్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రీసెంట్ గా జెఈఎస్ సభలో కూడా ఇవాంకాను ఇంప్రెస్ చేసేలా కె.టి.ఆర్ ఇచ్చిన స్పీచ్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చేలా చేసింది. ఇక ఇప్పుడు బిఎండబల్యు బిజినెస్ వరల్డ్ కెటిఆర్ ను లీడర్ ఆఫ్ ది ఇయర్ గా సెలెక్ట్ చేశారు.
ఈ విషయం ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి కె.టి.ఆర్ కు ఎంతోమంది తమ విషెష్ అందించారు. సిని ప్రముఖుల నుండి కూడా కె.టి.ఆర్ కు శుభాకాంక్షలు అందించారు. వాటిలో ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా హీరో విజయ్ దేవరకొండ పెట్టిన ట్వీట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. ఇంతకీ విజయ్ ఏం ట్వీట్ చేశాడు అంటే రామన్నా.. లీడర్ ఆఫ్ ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు శుభాకాంక్షలు అంటూ విష్ చేసి.. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడిని స్వార్ధపూరితంగా కోరుకుంటున్నా అని ట్వీట్ చేశాడు. విజయ్ ట్వీట్ కు కె.టి.ఆర్ రిప్లై ఇచ్చారు.. థ్యాంక్ యూ అర్జున్ రెడ్డి.. మిమ్మల్ని గారు అని సంభోధిస్తే బాగోదేమో అంటూ సరదా ట్వీట్ రిప్లై ఇచ్చారు.