అఖిల్ కు క్లీన్ సర్టిఫికెట్..!

అక్కినేని అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో. అఖిల్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తో అఖిల్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కింగ్ నాగార్జున నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా కథ మొత్తం ముందే రివీల్ చేసిన నాగార్జున సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.

ఇక ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అఖిల్ హలోకు సెన్సార్ వాళ్లు యు సర్టిఫికెట్ అందించారు. సినిమా టీజర్, ట్రైలర్స్ లో స్టంట్స్ అదిరిపోయాయి మరి ఆ స్టంట్స్ భారీ రేంజ్ లో ఉన్న యు/ఏ కాకుండా కేవలం యు సర్టిఫికెట్ ఇవ్వడం పట్ల అందరు షాక్ అవుతున్నారు. 24 తర్వాత విక్రం కుమార్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ సినిమా అఖిల్ కోరుకునే హిట్ ఇస్తుందో లేదో చూడాలి.