బాలీవుడ్ కు అర్జున్ రెడ్డి.. అబ్బే ఆ ఆలోచనలేమి లేవట..!

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా హిట్ తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక తెలుగులో ఇతని క్రేజ్ కనిపెట్టిన బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ వారు విజయ్ దేవరకొండకు భారీ ఆఫర్ ఇచ్చారట.

ఏకంగా ఒకేసారి 3 సినిమాల అగ్రిమెంట్ ఆఫర్ ఇచ్చారట. దానికి విజయ్ దేవరకొండ మాత్రం సారీ అని చెప్పేశాడట. ప్రస్తుతం తనకు బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదని చెబుతున్న విజయ్ యశ్ రాజ్ నుండి వచ్చిన భారీ డీల్ సైతం సున్నితంగా తిరస్కరించాడట. అదికాకుండా తెలుగులో వరుసగా సినిమాలు కమిట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా హింది సినిమాలు చేసే టైం లేదని అంటున్నాడట. మొత్తానికి బీ టౌన్ ఆఫర్ రాగానే ఎగిరి గంతేసే ఈ టైంలో విజయ్ డెశిషన్ కు అందరు షాక్ అవుతున్నారు.