
మెగాస్టార్ చిరంజీవి నటించిన కం బ్యాక్ మూవీ ఖైది నంబర్ 150 ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. పదేళ్ల తర్వాత కూడా తన సినిమాను ఇంతలా ఆదరిస్తారని తాను అనుకోలేదని.. తన సినిమాపై కాస్త అపనమ్మకం ఉండేదని కాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేలమంది అభిమానులను చూసి తనకు నమ్మకం కుదిరిందని అన్నారు చిరంజీవి. తాను సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పదేళ్లలో యువకులుగా ఉన్న వీరంగా చిన్న వాళ్లని వారు కూడా తన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చే సరికి తనకు ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నారు చిరంజీవి.
వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఖైది నంబర్ 150 సినిమా నాన్ బాహుబలి రికార్డులన్ని బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాతో మళ్లీ మెగా ఫ్యాన్స్ ను అలరించాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరు సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. జీ గోల్డెన్ అవార్డ్స్ వేడుకలో చిరు తన ఖైది నెంబర్ 150 సినిమా విశేషాలను పంచుకున్నారు.