అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఒక్క క్షణం. సురభి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న డైరక్టర్ ఆనంద్ మరోసారి తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమా కథ కొరియన్ మూవీ పార్లర్ లైఫ్ సినిమాకు కాపీ అంటూ వార్తలు మొదలు పెట్టారు.
నిన్ననే చివరి సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఒక్క క్షణం సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాడు అల్లు శిరీష్. మా సినిమా ఏ సినిమాకు కాపీ కాదు. 2 మేమిద్దరమే సినిమాకు కాపీ అంటూ వస్తున్న వార్తలు కూడా నిజం కాదని శిరీష్ వివరణ ఇచ్చాడు. అంతేకాదు ఎవరైనా సినిమా చూసి వచ్చి అడగండని ఛాలెజ్ చేశాడు. ఈ నెల 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు అల్లు శిరీష్.