
శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వల్ గా ఇండియన్-2 సినిమా చేయాలని ఎన్నాళ్ల నుండో ప్రయత్నాలు చేశారు. ఫైనల్ గా దిల్ రాజు నిర్మాణంలో ఇండియన్-2 సెట్స్ మీదకు వెళ్లబోతుందని ఎనౌన్స్ చేశారు. 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా నుండి దిల్ రాజు ఎక్సిట్ అయ్యాడని లేటెస్ట్ టాక్.
కొన్నాళ్లుగా మీడియాలో దిల్ రాజు కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయడు అన్న వార్తలు వస్తున్నా అవేవి పట్టించుకోలేదు. ఫైనల్ గా దిల్ రాజు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీయుడు సీక్వల్ గా అనుకున్న ఇండియన్-2 సినిమా నుండి తాను తప్పుకున్నట్టు చెప్పేశాడు. దీనికి కారణం ఏంటన్నది మాత్రం అతను చెప్పలేదు. కాని శంకర్ తో పెట్టుకుంటే బడ్జెట్ డబుల్ అవడం ఖాయమని అతన్ని తట్టుకోవడం కష్టమని అతనికి చెప్పారట.
అంతేకాదు లైకా ప్రొడక్షన్స్ వారే శంకర్ ధాటికి తట్టుకోలేకపోతున్నారని దిల్ రాజు తట్టుకోలేడని చెప్పారట. ఫైనల్ గా అనుకున్నట్టుగానే దిల్ రాజు ఇండియన్-2 పై చేతులెత్తేశాడు. మరి ఆ సినిమాను ఎవరు ఎప్పుడు నిర్మిస్తారో చూడాలి.