అందుకే వాళ్ళిద్దరూ విడిపోయారుట!

చాలా కాలంగా సరైన హిట్స్ లేక బాధపడుతున్న సుమంత్ కు ఇటీవల ‘మళ్ళీ రావా’ చిత్రంతొ హిట్ కొట్టాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, పెళ్ళైన ఏడాదిన్నరకే భార్య కీర్తిరెడ్డితో ఎందుకు విడిపోయారని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు, “మా ఇద్దరి అభిప్రాయలు, ఆలోచనలు, వ్యక్తిత్వాలు, జీవితాలు అన్నీ భిన్నమైనవని పెళ్ళైన కొన్ని నెలలకే గ్రహించాము. ఆవిధంగా ఇద్దరం కలిసి ఉండటం కష్టమని భావించి పరస్పర అంగీకారంతోనే విడిపోయాము. కలిసుండి కీచులాడుకోవడం కంటే విడిపోయి స్నేహంగా ఉండటం మంచిది కదా? అందుకే ఇద్దరం హ్యాపీగా జీవిస్తున్నాం. అవసరమైనప్పుడు మాట్లాడుకొంటుంటాము కూడా. నేటికీ మా ఇరువురి కుటుంబాల మద్య మంచి స్నేహసంబంధాలే ఉన్నాయి. అంటే మా నిర్ణయం సరైనదేనని స్పష్టం అవుతోంది కదా?” అని సుమంత్ జవాబిచ్చారు.