అజ్ఞాతవాసి టీజర్.. చర్యలు ఊహాతీతం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా నుండి ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న టీజర్ రిలీజ్ అయ్యింది. అనుకున్న విధంగానే టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో తెలియచేశాడు. స్టోరీ అంతగా రివీల్ కాకున్నా సరే పవర్ స్టార్ స్టైల్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఇక సినిమాలో కీర్తి సురేష్ క్యూట్ గా కనిపిస్తుంటే.. అను ఇన్నాన్యుయెల్ మాత్రం హాట్ లుక్స్ తో అదరగొడుతుంది.

టీజర్ లో అనిరుద్ మ్యూజిక్ కూడా అదరగొట్టేసింది. సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్న అజ్ఞాతవాసి టీజర్ అనుకున్నట్టుగానే మెగా, పవర్ ఫ్యాన్స్ ను ఖుషి చేసేలా వచ్చింది. సినిమాలో ఖుష్బు కూడా ప్రముఖ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమా తర్వాత రాబోతున్న అజ్ఞాతవాసితో కూడా అదే రేంజ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు త్రివిక్రం పవన్ కళ్యాణ్. 

జనవరి 10న రాబోతున్న ఈ సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేయగా సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది. ఈ నెల 19న ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఆరోజే రిలీజ్ అవబోతుంది.