పేరుకే సాయి కొర్రపాటి.. మొత్తం నడిపించేది ఆయనేట..!

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీయ భర్త కళ్యాణ్ హీరోగా తెరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. శశి అనే నూతన దర్శకుడు తీస్తున్న సినిమాతో కళ్యాణ్ హీరోగా రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకు నిర్మాతగా సాయి కొర్రపాటి వ్యవహరిస్తున్నారు. పేరుకే సాయి కొర్రపాటి కాని సినిమాకు చిరునే ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇన్నర్ టాక్. కొర్రపాటి సాయి కేవలం 25 శాతమే ఆ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాడట.

మొత్తానికి అల్లుడిని హీరోగా నిలబెట్టే క్రమంలో చిరు నిర్మాతగా కూడా మారాలని ఫిక్స్ అయ్యాడు. అయితే సినిమా బడ్జెట్ కూడా బాగానే పెట్టేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. మెగాస్టార్ 151వ సినిమా సైరా షూటింగ్ ఈమధ్యనే స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా గ్యాప్ లో అల్లుడి సినిమా విశేషాలను ఫాలో అప్ చేస్తున్నారట చిరంజీవి.