
సోషల్ మీడియా వచ్చాక ఎవరికి ఇష్టమొచ్చినట్టు వార్తలు అల్లేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అన్న ఆలోచన కూడా లేకుండా ఏది పడితే అది రాసేస్తున్నారు. ఇక యూట్యూబ్ ఛానెల్స్ వచ్చాక మరి ఎక్కువయ్యాయి. ఇక నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న న్యూస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా వారసురాలు నిహారిక పెళ్లి వార్త.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ తన పెళ్లి గురించి లేట్ చేయడంతో ఎవరెవరితోనో ముడి పెట్టేస్తున్నారు. కొన్నాళ్లు వెస్ట్ గోదావరి అమ్మాయి అని హడావిడి చేయగా.. మరి కొన్నాళ్లు అనుష్కతోనే ప్రభాస్ పెళ్లి అంటూ రచ్చ చేశారు. ఇక ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికతో ప్రభాస్ మ్యారేజ్ అంటూ హంగామా చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కాని నిహారికతో ప్రభాస్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి మాత్రం టాపు లేచిపోతుంది.