
ఈ ఇయర్ ఫిదాతో మరో సూపర్ హిట్ అందుకుని దర్శకుడిగా మళ్లీ తన సత్తా చాటిన శేఖర్ కమ్ముల ఈసారి గ్యాప్ లేకుండా తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల విజయ్ దేవరకొండతో తన తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్నాడట. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తాడని అంటున్నారు. ఫిదా సినిమా కూడా దిల్ రాజు నిర్మించాడని తెలిసిందే.
ఇక ఈ సినిమా కూడా ఫిదా లాంటి లవ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తుంది. అర్జున్ రెడ్డితో యూత్ లో మంచి పాపులారిటీ సంపాదించిన విజయ్ పరశురాం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్తాడట. మొత్తానికి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉన్నట్టే. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ చిన్న పాత్రలో కనిపించాడు.