
మెగా పవర్ స్టార్ రాం చరణ్ సినిమాల వేగం పెంచాడు. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాకు త్వరలోనే ముహుర్తం పెట్టబోతున్నారు. ఇక ఆ తర్వాత సినిమాలు లైన్ క్లియర్ చేస్తున్నాడు చరణ్. ఈమద్యనే అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన సెకండ్ మూవీ రాం చరణ్ తో చేయాలని చూస్తున్నాడట.
అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ కు కథ సిద్ధం అని చెప్పిన సందీప్ ఈమధ్య తరచు చరణ్ తో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన తర్వాత సినిమా చరణ్ తో చేసే ఉద్దేశంతోనే సందీప్ వంగ చరణ్ తో డిస్కషన్స్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఓకే అయితే కనుక సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. అసలైతే అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగ శర్వానంద్ తో సినిమా చేయాలని చూశాడు కాని ఎందుకో అది సెట్ అవలేదు.