
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ గా గీతా గోవిందం అని పెట్టబోతున్నారట. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్న పరశురాం ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం అంటూ వెరైటీ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. సినిమాలో కిర్రిక్ పార్టీ భామ రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఎవడే సుబ్రమణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి అతన్ని స్టార్ క్రేజ్ తీసుకొచ్చింది. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో దర్శకుడిగానే కాదు రచయితగా తన పెన్ పవర్ ఏంటో చూపించిన పరశురాం ఈ సినిమాతో కూడా సత్తా చాటుతాడని అంటున్నారు.