డబుల్ హ్యాట్రిక్ పక్కా అంటున్నాడు..!

దిల్ రాజు నిర్మాణంలో నాని హీరోగా వస్తున్న సినిమా ఎం.సి.ఏ. ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ కన్ ఫాం అంటున్నాడు దిల్ రాజు. ఈ ఇయర్ ఇప్పటికే శతమానం భవతి, నేను లోకల్, డిజె, ఫిదా, రాజా ది గ్రేట్ హిట్ సాధించామని చెబుతున్న దిల్ రాజు రాబోతున్న ఎం.సి.ఏ తో కూడా హిట్ పక్కా అని అంటున్నారు.

ఇక నాని కూడా ఎం.సి.ఏ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా నుండి నాని హిట్ సినిమాల ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఈ ఎం.సి.ఏ తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. నాని సక్సెస్ హవా ఈ సినిమా కొనసాగించేలా చేస్తుందో లేదో తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.