ప్రతిభ గల వారికి చక్కని అవకాశం.. డిజిక్వెస్ట్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్..!

తమలో ఉన్న టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు యువత అన్నిరంగాల్లో ముందడుగు వేస్తుంది. వృత్తి ఏదైనా సత్తా చాటాలని ప్రతి ఒక్కరు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక క్రియేటివ్ ఫీల్డ్ లో అయితే సరేసరి.. ఇండస్ట్రీలో కథలు లేవంటారు కాని కథలు ఉన్న వారికేమో అవకాశాలు ఇవ్వరు. ఇదంతా ఓ కథ అయితే.. ప్రతిభ ఉండి పడిగాపులు కాసే నటులు, దర్శకులు ఎంతమందో.. కృష్ణా నగర్లో గళ్లికో గొప్ప హీరో.. దర్శకత్వ కలలు కనే వారు ఎంతోమంది తారసపడతారు.


ఇక అసలు విషయం ఏంటి అంటే.. డిజిక్వెస్ట్ వారు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రతిభ గల వారికి గొప్ప అవకాశం అందిస్తున్నారు. షార్ట్ మూవీ కాంటెస్ట్ తో గొప్ప కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. షార్ట్ మూవీ పోటీ నిర్వహించి అందులో మొదటి మూడు గొప్ప షార్ట్ సినిమాలకు ప్రైజ్ మనీ అందిస్తున్నారు. ఇక మూవీ థీం కూడా వారే అందించారు. కరప్షన్ మీద షార్ట్ మూవీ చేయాల్సి ఉంటుంది. జనవరి 10లోగా ఎంట్రీలు పంపాల్సి ఉంటుంది.       


జనవరి 26వ తేదీన టాప్ 3 షార్ట్ మూవీస్ తీసిన వారికి క్యాష్ ప్రైజ్ అందిస్తారు. ఈ కాంటెస్ట్ లో మొదటి బహుమతిగా 3 లక్షలు, సెకండ్ ప్రైజ్ గా 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ గా 1 లక్ష రూపాయలు అందించనున్నారు. ఇక కాంటెస్ట్ జ్యూరీ సభ్యులుగా దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, రచయిత్రి బలబద్రపాత్రుని రమణి ఉంటున్నారు. డిజిక్వెస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కాంటెస్ట్ ను టాలెంట్ ఉన్న వారికి ఓ గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. మరి మీరు కూడా మూవీ మేకర్ అయితే మీరు వెంటనే ఇవ్వబడిన థీం పై షార్ట్ మూవీ తీసేయండి.