యూఎస్ లో అజ్ఞాతవాసి రికార్డ్ రిలీజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో రికార్డ్ సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది. యూఎస్ లో అజ్ఞాతవాసి 209 సెంటర్స్ లో రిలీజ్ అవుతూ సంచలనం సృష్టిస్తుంది. ఓ ఇండియన్ సినిమా యూఎస్ లో ఈ రేంజ్ లో రిలీజ్ అవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన బాహుబలి-2 సినిమానే 129 సెంటర్స్ లో రిలీజ్ అయ్యింది.

ఇక ఆ తర్వాత ఖైది నంబర్ 150, 74 లొకేషన్స్ లో రిలీజ్ అవగా.. కబాలి 73 లొకేషన్స్ లో వచ్చింది. ఇక బాహుబలికి పోటీగా కలక్షన్స్ సాధించిన దంగల్ కూడా 69 లొకేషన్స్ లో రిలీజ్ అయ్యింది. పవన్ కు యూఎస్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ ఎప్పుడు లేని విధంగా 209 లొకేషన్స్ లో రిలీజ్ అవబోతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా అజ్ఞాతవాసి రికార్డులు క్రియేట్ చేయడం కన్ఫాం అని తెలుస్తుంది.