
నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు ఐడియాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. తాను కొనేసిన సినిమాలతో కూడా లాభాలు తెచ్చుకోగల సమర్ధుడు దిల్ రాజు. అందుకే ఆయన నైజాంలో క్రేజీ డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. తన ప్రొడక్షన్ లో సినిమా అంటే ఓ బ్రాండ్ ఏర్పరచుకున్న దిల్ రాజు ఈమధ్య కమర్షియల్ సినిమాల హడావిడిలో పడి ట్రాక్ తప్పేశాడు.
అయినా సరే మంచి సినిమా అది తన నిర్మాణంలో రాకున్నా సరే కొనేస్తాడు దిల్ రాజు. ప్రస్తుతం అలాంటి క్రేజీ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా తొలిప్రేమ. ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ అయ్యి మెగా ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ సినిమాను దిల్ రాజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారట. భారీ మొత్తానికి సినిమాను సొంతం చేసుకున్నాడట దిల్ రాజు. ఈ ఇయర్ ఇప్పటికే ఫిదాతో వరుణ్ తేజ్ తో సూపర్ హిట్ కొట్టిన దిల్ రాజు ఆ హీరో సినిమానే కొనేశాడు. 2018 ఫిబ్రవరి 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ తొలిప్రేమ దిల్ రాజుకి ఎలాంటి లాభాలు తెస్తుందో చూడాలి.