
అక్కినేని అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో. కింగ్ నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా హైప్ మరింత పెంచేలా ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అందులో భాగంగా ఆడియోని ఉత్తరాంధ్రలో జరుపనున్నారట. వెజాగ్ లో అక్కినేని అభిమానులు ఎక్కువే ఉన్నారు.
అక్కినేని ఫ్యామిలీ ప్రతి సినిమాలు అక్కడ మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే హలో ఆడియోని వైజాగ్ లో నిర్వహించాలని చూస్తున్నాడట నాగార్జున. ఈ ఆడియోకి స్పెషల్ గెస్టులుగా స్టార్స్ ను ఇన్వైట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 22న రిలీజ్ అవబోతున్న అఖిల్ హలో సినిమా ఫలితం మీద అతని కరీర్ ఆధారపడి ఉంది. అఖిల్ ఫ్లాప్ తర్వాత ఏరికోరి అఖిల్ చేసిన ఈ హలో సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.