వెనక్కి తగ్గే ఆలోచనలో మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అను నేను అని ప్రచారంలో ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కన్ఫాం అని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ నాడే రజినికాత్ రోబో సీక్వల్ 2.0 కూడా వస్తుండటంతో మహేష్ సినిమా దర్శక నిర్మాతల్లో భయం మొదలైంది. 450 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న 2.0 సినిమాకు పోటీగా మహేష్ సినిమా అంటే కష్టమే అని అంటున్నారు.

అందుకే మహేష్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నాడట. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపులతో కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్న మహేష్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఏప్రిల్ 13న తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.