సైరాకు అతనే దిక్కా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా రెహమాన్ పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెహమాన్ మ్యూజిక్ అనగానే సినిమా రేంజ్ మరింత పెరిగింది అనుకున్నారు. అయితే రీసెంట్ గా తన సినిమాల కమిట్మెంట్ వల్ల రెహమాన్ సైరా నుండి బయటకు వచ్చేశాడు. కథ బాగుంది అంటూ సైరా నుండి తప్పుకున్నాడు. దానికి కారణం ఏంటి అన్నది ఇంకా తెలియలేదు.

టైటిల్ లోగోలో తమన్ చేత మ్యూజిక్ అందించగా సైరా సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడని రెహమాన్ ప్లేస్ ఖాళ్లీ అవ్వగానే ఆ ఛాన్స్ తమన్ కే ఇస్తారని అనుకున్నారు. కాని అనుకున్నట్టు తమన్ కు సైరా ఛాన్స్ ఇవ్వట్లేదట. రెహమాన్ బదులు కీరవాణి సైరాకు సంగీతం అందిస్తాడని తెలుస్తుంది. బాహుబలి సినిమా మ్యూజిక్ పరంగా కూడా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇక అదే తరహాలో రాబోతున్న సినిమా కాబట్టి కీరవాణికి ఈ సినిమా ఛాన్స్ ఇస్తున్నారట.

కీరవాణి మాత్రం సైరాకు పనిచేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న సైరా సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తుండగా తెలుగు తమిళ హింది భాషల్లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రాబోతుంది.