
కింగ్ నాగార్జున సంచలన దర్శకుడు ఇద్దరు కలిసి దాదాపు పాతికేళ్ల తర్వాత చేస్తున్న సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లింది. వర్మ దర్శక నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నాగ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక సినిమా టైటిల్ గా గన్, సిస్టెం అని రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారట. శివతో సంచలనాలు సృష్టించిన ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే ఇండస్ట్రీలో కూడా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా టైటిల్ గన్ అవుతుందా లేక సిస్టెం ఫైనల్ చేస్తారా అన్నది చూడాలి. సినిమాలో హీరోయిన్ గా మోడల్ గా క్రేజ్ తెచ్చుకున్న మైరా సరీన్ ను ఎంచుకున్నారు. ఇప్పటికే నాగార్జున రఫ్ లుక్ తో వచ్చిన పిక్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా సినిమా టైటిల్స్ గురించి కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి చూస్తుంటే నాగార్జునతో వర్మ హిట్ ట్రాక్ ఎక్కేసేలానే ఉన్నాడు.