
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా అభిరుచి గల సినిమాలను చేస్తూ వస్తున్నా ఫిదాతో కెరియర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో తొలిప్రేమ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బివిఎసెన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తొలిప్రేమ ఈ టైటిల్ కు ఉన్న పవర్ ఏంటో అందరికి తెలిసిందే.
పవర్ స్టార్ పవ్న కళ్యాణ్ కరుణాకరణ్ కాంబినేషన్ లో వచ్చిన తొలిప్రేమ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇక అదే టైటిల్ తో వరుణ్ తేజ్ తప్పకుండా ఆ అంచనాలను అందుకోవాలి. మెగా అభిమానులకు ఇష్టమైన టైటిల్ తో వస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటాడని అంటున్నారు. మరి బాబాయ్ టైటిల్ అబ్బాయికి ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.
కొద్ది గంటల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా వరుణ్ తేజ్ లుక్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. మరి క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ తొలిప్రేమ ఎలాంటి పరవశం కలిగిస్తుందో చూడాలి.