
150వ సినిమా ఖైది నంబర్ 150 సూపర్ హిట్ అవడంతో మెగాస్టార్ చేయబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమా మీద అందరి ఫోకస్ ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో రాబోతున్న ఈ సైరా సినిమాకు మెగాస్టార్ కంప్లీట్ మేకోవర్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం సొషల్ మీడియాలో చిరంజీవికి సంబందించిన ఓ ఫోటో చెక్కర్లు కొడుతుంది. గడ్డెం లుక్ తో బాడీ ఫిట్ గా కనిపిస్తున్నాడు మెగాస్టార్. ఇక సైరాలో తన లుక్ ఇదే అంటూ హంగామా చేయడం మొదలు పెట్టారు మీడియా వాళ్లు.
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. పరుచూరి సోదరులు కథ అందించిన ఈ సినిమాకు సాయి మాధవ్ మాటలను అందిస్తున్నారు. ఈమధ్యనే రెహమాన్ ఈ సినిమా నుండి బయటకు రాగా తమన్ సైరాకు మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది.
150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కనుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బి అమితాబ్, సుదీప్, జగపతి బాబు సైరాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.