చరణ్ కెరియర్ లోనే హయ్యెస్ట్ ప్రైజ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. పల్లెటూరి నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాలో చెర్రి కొత్త లుక్స్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సుకుమార్ సినిమాలకు దేవి మార్క్ సైన్ తో వచ్చే మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక రాబోతున్న రంగస్థలం సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని అంటున్నారు.

అందుకే ఈ సినిమా ఆడియో రైట్స్ కోటి 60 లక్షలకు కొనేశారట లహరి మ్యూజిక్ సంస్థ. ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండగా లహరి మ్యూజిక్ పూర్తిస్థాయిలో సినిమాలను దక్కించుకుంటుంది. మహేష్ భరత్ అను నేను ఆడియో హక్కులను సొంతం చేసుకున్న లహరి మ్యూజిక్ ఇప్పుడు చెర్రి రంగస్థలం సినిమాను కొనేశారట. చరణ్ కెరియర్ లో ఆడియో రైట్స్ 1.60 లక్షలు వెళ్లిన మొదటి సినిమా రంగస్థలమే అని తెలుస్తుంది.