నాగార్జున అవార్డ్ టచ్ అదిరిపోయింది..!

ఈమధ్య ప్రకటించిన నంది అవార్డుల్లో మనం సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డ్ ప్రకటించలేదని కొందరు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుల రచ్చపై కొందరు సిని ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. మనం సినిమాకు అవార్డ్ రానివ్వకుండా చేశారని కొందరన్న మాట అందరికి తెలుసు. ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ నుండి ఎలాంటి కామెంట్ రాలేదు.

అయితే దీనిపై స్పందించడం ఇష్టంలేని నాగార్జున అఖిల్ హలో ట్రైలర్ లో మాత్రం అవార్డ్ ప్రస్థావన తీసుకురావడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. అఖిల్ హలో ట్రైలర్ లో 'ఫ్రం ది డైరక్టర్ ఆఫ్ మనం' తో పాటుగా 'టూ విచ్ యు అవార్డెడ్ ఇన్ యువర్ హర్ట్స్' అంటూ పెట్టడం విశేషం. ఈ పోస్టర్ కచ్చితంగా నాగార్జున నంది అవార్డుల మీద పంచ్ చేసేందుకే ప్లాన్ చేశాడని అంటున్నారు. ప్రత్యక్షంగా కాకుండా ఇలా పరోక్షంగా నాగ్ నంది అవార్డులపై తన రెస్పాన్స్ తెలిపారు.