
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అను నేను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ నెల 7 దాకా షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా 10 నుండి చెన్నైలో షూటింగ్ జరుపుకోనుందట. బ్రహ్మోత్సవం, స్పైడర్ డిజాస్టర్ల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుంది.
భరత్ అను నేను ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ 1.90 కోట్లకు కొనేశారట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడవడం చూస్తుంటే సినిమా రేంజ్ ఏంటన్నది అర్ధం అవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఏప్రిల్ 27న రిలీజ్ అవనున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు.