
బాహుబలి తర్వాత రాజమౌళి చేసే సినిమా చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ అని తెలిసిందే. అయితే సినిమాలో చరణ్ మెయిన్ హీరో కాగా తారక్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో చరణ్, తారక్ లు ఇద్దరు బాక్సర్స్ గా కనిపిస్తారట. స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం చరణ్, తారక్ లు ఇద్దరు మంచి దేహదారుడ్యంతో కనిపించాల్సి ఉందట.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2018 సమ్మర్ లో మొదలవనుందని తెలుస్తుంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రూపొందిస్తారని టాక్. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తుండగా త్వరలోనే ఈ సినిమా అఫిషియల్ స్టేట్మెంట్ ఎనౌన్స్ చేస్తారట. సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో అనగనే మెగా నందమూరి అభిమానుల్లో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.