
ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోల హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలిసిందే. ఇక వారిలో మెగా హీరోల హంగామా తెలిసిందే. ముఖ్యంగా సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లు అతి తక్కువ టైంలో మెగా అభిమానులకు దగ్గరయ్యారు. ఈరోజే జవాన్ గా ప్రేక్షకులను పలుకరించిన సాయి ధరం తేజ్ పాజిటివ్ రివ్యూస్ అందుకోవడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత వినాయక్, కరుణాకరణ్ లతో సినిమాలు లైన్ లో పెటాడు.
ఎవరు ఊహించని కాంబినేషన్ సెట్ చేసుకున్నాడట సాయి ధరం తేజ్. ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం లాంటి వెరైటీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించిన చంద్రశేఖర్ యేలేటి లాస్ట్ ఇయర్ చేసిన మనమంతా సినిమా అంచనాలను అందుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈసారి చంద్రశేఖర్ యేలేటి ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నాడట.. అందుకే సాయి ధరం తేజ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. ఇప్పటికే కథా చర్చలు ముగియగా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వస్తుందని తెలుస్తుంది.