అనుష్కకు మరో లక్కీ ఛాన్స్..!

 సౌత్ లో క్రేజీ బ్యూటీ అయిన అనుష్క సైజ్ జీరో కోసం బరువు పెరిగి కొన్ని సినిమా అవకాశాలను వదులుకుంది. అయితే మళ్లీ అమ్మడు ఎప్పటిలానే నాహుగ్గా తయారైన పిక్ ఒకటి ఈమధ్యనే రివీల్ చేసింది. ఇక అలా సన్నబడిందో లేదో అమ్మడికి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో భాగమతి రిలీజ్ కు రెడీ అవుతుండగా కోలీవుడ్ లో అనుష్కకు ఓ లక్కీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా శివ డైరక్షన్ లో రాబోతున్న విశ్వాసం సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని ఫైనల్ చేశారట. అనుష్క ఇప్పటికే అజిత్ తో కలిసి ఓ సినిమాలో నటించగా అందులో లీడ్ హీరోయిన్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు అజిత్ విశ్వాసంలో సోలో హీరోయిన్ గా అనుష్క ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇదే కాకుండా గౌతం మీనన్ డైరక్షన్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిందని అంటున్నారు.