
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకున్నా అంటుంది కలర్స్ స్వాతి. బుల్లితెర మీద తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న అమ్మడు ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక హీరోయిన్ గా కొన్నాళ్లు పర్వాలేదు అనిపించగా ఇప్పుడు ఫేడవుట్ అయ్యింది. అరకొర అవకాశాలతో కెరియర్ సాగిస్తున్న అమ్మడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్ని ఛాన్స్ మిస్సైన సంగతి చెప్పింది.
అయితే అది ఇప్పటి సంగతి కాదు.. అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇస్తూ రాఘవేంద్ర రావు డైరక్షన్ లో వచ్చిన గంగోత్రి సినిమాలో అదితి అగర్వాల్ కంటే ముందు కలర్ స్వాతిని అడిగారట. అయితే ఎం.బి.బి.ఎస్ చదువుతున్న అమ్మడు సెమిస్టర్ ఎక్సామ్స్ కు ఇబ్బంది కలుగుతుందని ఆ సినిమా ఆఫర్ వద్దనుకుందట. ఒకవేళ స్వాతి ఆ సినిమా చేసుంటే కనుక కచ్చితంగా ఇప్పుడు వేరే రేంజ్ లో ఉండేదని అంటున్నారు.