
నాచురల్ స్టార్ నాని హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో రాబోతున్న సినిమా ఎం.సి.ఏ. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి మొదటి సాంగ్ టైటిల్ సాంగ్ వారం క్రితం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వగా.. ఇప్పుడు సినిమా నుండి సెకండ్ సాంగ్ కొత్తగా కొత్తగా అంటూ రిలీజ్ అయ్యింది.
సాగర్ పాడిన ఈ పాట రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్ లో ఉండటం విశేషం. దేవి మార్క్ ట్రెండీ మ్యూజిక్ తో వచ్చిన ఈ పాట శ్రీరమణ రచించడం జరిగింది. ఫిదా భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దేవి మ్యూజిక్ తో సగం హిట్ అనిపించుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి హిట్ సినిమా అవుతుందో చూడాలి.