చరణ్ రంగస్థలం ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం 1985 సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పల్లెటూరి ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ కొత్తగా ఉంటుందని అంటున్నారు.

కథ కథనాలు కూడా సుకుమార్ రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ప్రతి ఫ్రేం చాలా కొత్తగా ఉంటుందట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క ఎడిటింగ్ జరుపుతున్నారట. మొత్తానికి చరణ్ రంగస్థలం సినిమా సరికొత్త సంచలనాలు సృష్టించడం గ్యారెంటీ అని ఫిల్మ్ నగర్ టాక్.