మహేష్ సినిమా మళ్లీ ట్విస్ట్..!

కొరటాల శివ డైరక్షన్ లో మహేష్ హీరోగా భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అయితే అదే డేట్ కు అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య సినిమా రిలీజ్ అనుకున్నారు. ఈ విషయంపై నా పేరు సూర్య సహ నిర్మాత బన్ని వాసు ఈ విషయంపై డిస్కస్ చేయడం నా పేరు సూర్య కూడా అనుకున్న టైం కు రావడం పక్కా అని చెప్పడం తెలిసిందే. 

ఇక మళ్లీ రిలీజ్ డేట్ చెబుతూ మహేష్ సినిమా నుండి షెడ్యూల్ వివరాలను తెలియచేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కూడా ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ అని మళ్లీ మెషన్ చేయడం విశేషం. అసలు షెడ్యూల్ వివరాలు ఎందుకు తెలుపుతున్నారో అర్ధం కాలేదు అందులోనూ రిలీజ్ డేట్ కూడా చెప్పడం చూస్తుంటే మళ్లీ బన్ని దర్శక నిర్మాతలకు వెనక్కి తగ్గడం కుదరదని చెప్పినట్టే అంటున్నారు. మరి దీనిపై బన్ని దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.