
స్వీటీ అనుష్క ఎట్టకేలకు సన్నబడ్డది. సైజ్ జీరో కోసం లావెక్కిన అమ్మడు ఆ సినిమా ఫలితం నిరాశ పరచడమే కాకుండా అనుష్కకు చాలా చిక్కులు తెచ్చిపెట్టింది. బాహుబలి-2 ఎలాగోలా మ్యానేజ్ చేయగా సింగం-3లో అనుష్క కాస్త బొద్దుగా కానొచ్చింది. ఇక భాగమతిలో మాత్రం మళ్లీ తన రెగ్యులర్ లుక్ తో అలరిస్తుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ లో మాత్రం అనుష్క స్లిం గానే కనిపించింది.
ఇక లేటెస్ట్ గా అనుష్క తన ఫేస్ బుక్ లో ఓ పిక్ షేర్ చేసింది. స్లిం లుక్ లో బేబి కటింగ్ తో అనుష్క లుక్ వావ్ అనేలా ఉంది. ఇక ఈ ఫోటోతో పాటుగా అమ్మడు అబ్ధుతం జరగాలని కలలు కంటే సరిపోదు దానికి చెమటను చిందించాలి.. అంకితభావంతో కృషి చేయాలి అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది. ఇదంతా తను సాధించిన ఈ స్లిం లుక్ చూపించే చెబుతుంది అంటే కచ్చితంగా అనుష్క ఈ లుక్ కోసం ఎంత కష్టపడిందో అర్ధం చేసుకోవచ్చు.