
బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు అన్న అంచనాలను అందుకుంటూ ఓ క్రేజీ మల్టీస్టారర్ కు సిద్ధమవుతున్నాడు జక్కన్న. చరణ్, తారక్ లతో ఓ సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి దానికి క్లూ ఇస్తూ వారిద్దరితో దిగిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాదాపు ఆ పిక్ షేర్ చేసిన దగ్గరనుండి ఎన్నో ఊహాగానాలు మొదలల్లాయి.
ఇక ఆ పిక్ లో ఉన్న అసలు విషయం బయట పెట్టాడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్. అందరి లానే రాజమౌళితో చరణ్, ఎన్.టి.ఆర్ లను చూసి సర్ ప్రైజ్ అయిన తేజ్ వెంటనే చరణ్ కు ఫోన్ చేసి విషయం కనుక్కున్నాడట. ఇక బయట వస్తున్న వార్తలు నిజమే అన్నట్టు తేజ్ చెప్పడం జరిగింది. సో మొత్తానికి రాజమౌళి రాం చరణ్, ఎన్.టి.ఆర్ తో సినిమా అంటే ఇక సంచలనాలు అని చెప్పొచ్చు.
150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో చరణ్, తారక్ అన్నదమ్ములుగా నటిస్తారని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2018 సమ్మర్ లో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.