కొరటాలతోనే అఖిల్..!

అక్కినేని అఖిల్ హీరోగా రెండవ సినిమా హలో రిలీజ్ కు సిద్ధమవుతుంది. విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో చూపించిన చిత్రయూనిట్ సినిమాతో హిట్ కొట్టడం గ్యారెంటీ అన్నట్టు కనబడుతుంది. ఇక ఈ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే అఖిల్ తన థర్డ్ మూవీ చేస్తాడని తెలుస్తుంది. 

తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ మూడవ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా పూర్తి కాగానే వెంటనే అఖిల్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే అఖిల్ కు తగిన కథను సిద్ధం చేసిన కొరటాల శివ నాగార్జున, అఖిల్ లతో చర్చలు జరిపారని తెలుస్తుంది. 

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ప్రస్తుతం భరత్ అను నేను సినిమా తర్వాత అఖిల్ తో సినిమా లైన్ లో పెట్టిన కొరటాల శివ కచ్చితంగా ఈ సినిమాను భారీ హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.