శర్వాతో కాజల్ కన్ఫాం చేసింది..!

ప్రస్తుతం యువ హీరోల్లో మంచి ఫాంలో ఉన్న శర్వానంద్ ఒకేసారి రెండు సినిమాలను స్టార్ట్ చేశాడు. హను రాఘవపుడి సినిమా ఇటీవలే మొదలు పెట్టిన శర్వానంద్ ఈరోజు సుధీర్ వర్మ సినిమాకు ముహుర్తం పెట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రాబోతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో శర్వానంద్ రెండు పాత్రల్లో నటిస్తుండగా ఒక హీరోయిన్ గా నిత్యా మీనన్ ను సెలెక్ట్ చేశారు.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రాజా ధి రాజా సినిమాల్లో కలిసి నటించిన నిత్యా, శర్వానంద్ మరోసారి జతకడుతున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి శర్వా నిత్యా కలిసి చేస్తున్నారు. ఇక స్టార్స్ తో నటించిన కాజల్ కూడా శర్వానంద్ కు ఓకే చెప్పింది. శర్వానంద్ సినిమా ఆఫర్ రాగానే ముందు ఆలోచించిన కాజల్ రెమ్యునరేషన్ భారీగా ఇస్తుండటంతో ఈ సినిమాకు ఓకే చెప్పిందట.