
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఫైనల్ గా అజ్ఞాతవాసి అనే టైటిల్ ను ఎనౌన్స్ చేసింది. కొద్దిరోజులుగా ఇదే టైటిల్ మీడియాలో వినపడుతున్నా చిత్రయూనిట్ ఈరోజు సినిమా టైటిల్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది. ఇక సినిమా ఫస్ట్ లుక్ లో పవన్ స్టైలిష్ లుక్ అదుర్స్ అంటున్నారు మెగా పవర్ స్టార్ అభిమానులు. ఐడి కార్డ్ తో తిప్పుతూ పవన్ లుక్ సూపర్ అన్నది చిన్నమాటే అవుతుంది.
త్రివిక్రం మార్క్ ఫస్ట్ లుక్ తో వచ్చిన అజ్ఞాతవాసి డిసెంబర్ రెండో వారంలో ఆడియోని రిలీజ్ చేయనున్నారు. సినిమాకు ట్యాగ్ లైన్ గా ప్రిన్స్ ఇన్ ఎక్సయిల్ అంటూ పెట్టారు. ఇక జనవరి 10న రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రిలీజ్ అయిన మొదటి సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.