
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కం బ్యాక్ మూవీగా రిలీజ్ అయిన గరుడవేగ కలక్షన్స్ ఎలా ఉన్నా మరోసారి రాజశేఖర్ సత్తా ఏంటన్నది ప్రూవ్ చేసింది. రాజశేఖర్ లోని ఫైర్ అదేలా ఉందని చూపించిన గరుడవేగ ఆయనకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెడుతుంది. ప్రస్తుతం రాజశేఖర్ కు ఓ లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో రాజశేఖర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడట.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ సినిమాలో వెంకటేష్ బావగా రాజశేఖర్ నటిస్తున్నాడని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా రాజశేఖర్ ను ఫిక్స్ చేశారట. తేజ డైరక్షన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా రాజశేఖర్ చేయాల్సింది. షూటింగ్ మొదలై మధ్యలో ఆ సినిమా ఆగిపొయింది. ఆ తర్వాత అదే సినిమా రానా చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తేజ వెంకటేష్ సినిమాలో నటిస్తున్నాడు రాజశేఖర్.