
హాట్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ తనకు ఫాలో అయ్యే వారితో ఎప్పుడు టచ్ లో ఉంటుంది. ఇక ఈమధ్య రెగ్యులర్ షూట్స్ ఉండటం వల్ల ఫేస్ బుక్ లైవ్ చాట్ చేయని అమ్మడు రీసెంట్ గా టైం చూసుకుని లైవ్ చాట్ చేసింది. ఇక జబర్దస్థ్ మీద వస్తున్న విమర్శలకు ఓపికగా సమాధానం చెబుతున్న అనసూయ తనను ఓ అభిమాని ఆంటీ అని పిలవగా వెంటనే సీరియస్ అయ్యింది.
తనని ఆంటీ అని పిలవడం ఏంటి.. మా బాబు ఫ్రెండ్స్ పిలిస్తే ఓకే కాని.. మీసాలు గడ్డాలు ఉన్న మీరు నన్ను ఆంటీ అని పిలవడం ఏంటి.. మంచి మూడ్ లో ఉండి ఫేస్ బుక్ లైవ్ కు వచ్చా మూడ్ చెడగొట్టే కామెంట్స్ చేయొద్ధని అన్నది అనసూయ. ఇక బుల్లితెర ప్రస్థానంలో జబర్దస్త్ ఓ బాహుబలి అని.. కేవలం ఎంటర్టైన్ చేయడానికే అలా చేస్తున్నామని అన్నారు. సమర్ధించుకోవడంలో అనసూయ తర్వాతే కాని అర్జున్ రెడ్డి సినిమా గురించి అమ్మడు లొల్లి పెట్టినప్పుడు మరి ఈ జబర్దస్త్ ఎందుకు గుర్తుకు రాలేదో అంటున్నారు నెటిజెన్లు.