
తెలుగు సినిమా పరిశ్రమలో బ్రహ్మాజి గురించి తెలియని వారు ఉండరు. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న బ్రహ్మాజి హీరోగా.. విలన్.. వేశాలతో పాటు కొత్తగా కామెడీ రోల్స్ చేస్తూ స్థిరపడ్డాడు. మధ్యలో కెరియర్ కాస్త అటు ఇటుగా సాగినా ఇప్పుడు తనకోసం వచ్చిన పాత్రలను చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు బ్రహ్మాజి కెరియర్ లో ఓ క్రేజీ మూవీ వచ్చి చేరుతుందని టాక్.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో బ్రహ్మాజి కూడా నటిస్తున్నాడట. ఓ క్రేజీ రోల్ లో బ్రహ్మాజి కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజి నటించడం కన్ఫాం అయితే మనవాడి కెరియర్ ఇంకాస్త జోరు కొనసాగించినట్టే. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న సైరా సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు.