
కొన్నాళ్లుగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రాబిన్ హుడ్ అనే సినిమా వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. చక్రి డైరక్షన్ లో రాధామోహన్ ఈ సినిమాను నిర్మించాలని చూశారు. అయితే కథ పట్ల అంత కాన్ఫిడెంట్ లేని రవితేజ ఫైనల్ గా ఆ సినిమాకు సారీ చెప్పేశాడట. ఇక ఆ సినిమా రవితేజ నుండి గోపిచంద్ చెంతకు చేరిందని తెలుస్తుంది. రవితేజ వదిలిన ఆ కథను రాధామోహన్ తన అనుభవంతో కొన్ని మార్పులు చేసి గోపిచంద్ కు వినిపించాడట.
ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్న గోపిచంద్ చేతిలో సినిమాలు కూడా లేకపోయేసరికి చక్రికి ఓకే చెప్పాడట. అయితే సినిమా టైటిల్ రాబిన్ హుడ్ అంటే బి, సి సెంటర్స్ ఎక్కడం కష్టమని సినిమా టైటిల్ కూడా మార్చేస్తున్నారట. మాన్లీ స్టార్ గా గోపిచంద్ కెరియర్ ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. ఎలాగైనా ఓ కమర్షియల్ హిట్ కొట్టి మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు గోపిచంద్. మరి చక్రితో చేస్తున్న ఈ ప్రయత్నమైనా గోపిచంద్ కు సక్సెస్ ఇస్తుందేమో