సునీల్ 2 కంట్రీస్ ఫస్ట్ లుక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా వచ్చారు.. కానీ కొద్దిమందే హీరోలుగా సెట్ అయ్యారు. అయితే ఇండస్ట్రీకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ అందాల రాముడు సినిమా తో హీరోగా మారాడు. అప్పటి నుంచి హీరోగానే కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో టూ కంట్రీస్ అనే సినిమా చేస్తున్నాడు సునీల్‌. ఈ చిత్రంలో మ‌నీశా రాజ్  హీరోయిన్ గా న‌టిస్తుంది. 2015లో మ‌ల‌యాళంలో వ‌చ్చిన టూ కంట్రీస్‌కి రీమేక్‌గా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.    

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. గోపి సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు ఆయన మ్యూజిక్ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంద‌ని టీం భావిస్తుంది. తాజాగా టూ కంట్రీస్ సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. హీరోగా మార్కెట్ డల్ గా ఉన్న సునీల్ ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఆల్రెడీ హిట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి తెలుగులో అదే రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.