విజయ్ తో సోషల్ మెసేజ్..!

స్పైడర్ అంటూ మహేష్ తో తెలుగు తమిళ భాషల్లో మురుగదాస్ తీసిన సినిమా డిజాస్టర్ గా మిగలగా కాస్త గ్యాప్ తీసుకుని మురుగదాస్ మళ్లీ తన తర్వాత సినిమాను షురూ చేశాడు. ముందు అనుకున్నట్టుగానే విజయ్ తో తన తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్న మురుగదాస్ ప్రస్తుతం ఆ సినిమా కథ రాసుకునే పనిలో ఉన్నాడట. తుపాకి, కత్తి తర్వాత విజయ్ తో మురుగదాస్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా కూడా సోషల్ మెసేజ్ తో వస్తుందని టాక్.

రీసెంట్ గా అట్లీ డైరక్షన్ లో విజయ్ చేసిన మెర్సల్ సినిమా సంచలనాలు సృష్టించింది. తెలుగులో అదిరిందిగా రిలీజ్ అయిన మెర్సల్ ఇక్కడ కూడా పర్వాలేదు అనిపించుకుంది. మరి మురుగదాస్ తో విజయ్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. స్పైడర్ అంచనాలను అందుకోవడంలో విఫలమవగా ఈసారి పక్కా హిట్ సబ్జెక్ట్ తో విజయ్ సినిమా చేస్తున్నాడట మురుగదాస్.