రంగస్థలం ఓ క్లాసిక్ అటెంప్ట్..!

సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం 1985 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సినిమా రషెష్ చూసి మెగాస్టార్ చాలా సంతోషంగా ఉన్నారట. రాజమౌళితో కలిసి ఈ రషెష్ చూసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. కచ్చితంగా తెలుగు సినిమాల్లో ఇదో మంచి క్లాసిక్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. 


30 ఏళ్ల క్రితం జరిగిన పల్లెటూరి ప్రేమకథతో ఈ సినిమా రాబోతుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుంది. సినిమాలో చరణ్ లుక్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా సుకుమార్ తన రెగ్యులర్ స్టైల్ లో కాకుండా ఈ సినిమాను కొత్తగా తెరకెక్కిస్తున్నారట.