అన్నపూర్ణా స్టూడియోలో బారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో బారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక సెట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన మంటలు, పక్కనే ఉన్న ‘మనం’ సెట్స్ కు వ్యాపించడంతో అది కూడా మంటల్లో దగ్ధం అయిపోయింది. అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకోగానే నాలుగు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మీడియా ద్వారా ఈ సంగతి తెలుసుకొన్న నాగార్జున కూడా అక్కడికి చేరుకొని, సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

‘మనం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అందరూ నటించారు. అక్కినేని నాగేశ్వర రావు చనిపోయే ముందు చివరిగా చేసిన చిత్రం అది. కనుక ‘మనం’ సెట్స్ ను స్వర్గీయ అక్కినేని యొక్క ఒక తీయటి జ్ఞాపకంగా అలాగే కదపకుండా ఉంచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అది అగ్నిప్రమాదంలో దగ్ధం అయిపోయింది.