
కొన్ని కాంబినేషన్స్ తెర మీద చూడాలనే కోరిక అభిమానులకు ఉంటుంది. వారి కోరిక గట్టిదైతే కచ్చితంగా నెరవేరుతుంది కూడా. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ మల్టీస్టారర్ మూవీస్ లో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుండగా బాలీవుడ్ వాళ్లతో మనవాళ్లు తీసే సినిమాలు ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బి అమితాబ్ ను తెలుగు తెర మీద చూపించాలనే ప్రయత్నం ఎన్నాళ్లనుండో సాగుతుంది.
ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ నటిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా నాగార్జున, ఆర్జివి కాంబినేషన్ లో మూవీలో అమితాబ్ నటించేస్తున్నాడని టాక్. బాలయ్య కృష్ణవంశీ డైరక్షన్ లో రైతు సినిమాలో నటించేందుకు అమితాబ్ ను సంప్రదించగా ససేమీరా ఒప్పుకోలేదట. కేవలం అమితాబ్ కాదన్నాడని ఆ సినిమానే వదిలేశాడు బాలకృష్ణ. మరి చిరు, నాగార్జున సినిమాల్లో నటించడానికి సరే అన్న అమితాబ్ బాలకృష్ణ సినిమాను ఎందుకు కాదన్నాడు అన్నది తెలియాల్సి ఉంది.